లార్డ్స్: వన్డే క్రికెట్, టీ20 మ్యాచ్ లకు ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్ మెన్, మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ రిటైర్మెంట్ ప్రకటించారు. పీటర్సన్ రిటైర్మెంట్ ను ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ధృవీకరించింది. రిటైర్మెంట్ ప్రకటనకు ముందు ఈసీబీ అధికారులతో పీటర్సన్ చర్చించారు. ఇంగ్లండ్ తరఫున 127 వన్డేలు ఆడిన పీటర్సన్ 9 సెంచరీలు, 23 అర్ధ సెంచరీలతో 4184 పరుగులు చేయగా, 36 టీ-20లు ఆడిన కెవిన్ 7 అర్ధ సెంచరీలతో 1176 పరుగులు చేశాడు.
No comments:
Post a Comment